కాలమహిమ

glory of timeపైసలున్నవాడె పవిత్రు కలిలోన
పొందు విధము తెలియకున్న
నిక్కముగ మనుచున్న నరుడెవ్వడైన
పైసకు కొఱగాడు నెత్తిన రూకలెన్నిడిన
ఆడంబరముతోడ ఆర్భాటములతోడ
రంగు లద్దిన కాకితంపు కట్లతోడ
కులము బలము తోడ కూర్మిబొందు
డంబమే లేనిదదేమి బ్రతుకు ఈ కలినందు
మోసంబురాదని గోసపెట్టిన వాడు
మోసపోయినవాడు మూసగతిన
మోసపోవుచునుంద్రు మహినె మరల మరల
వాని మహిమకాదు ఈ కలికాల మహిమ
ధ్యాస ధనమునందు పొర్లుదండములు
గుడి,గోపురములందు మునకలెన్నొవేయు
ముక్కోటితీర్థముల మునిగినప్పుడేగాని
పిదప గుర్తురాదు దైవభక్తి కలికాలమందు
రోగ,రొష్టులతోడ,రోతగల్గు వాక్మదముతోడ
రొక్కము విదిల్చి మేలుసేతు రారోయంచు
రచ్చనందు పలుకు డంబపు రంకెలెల్ల, క్రచ్చు
దీరువేళ ఉచ్చులను బిగించు కాదె కాలమహిమ
– లక్ష్మీశేఖర్‌ నీలగిరి, 9542490634

Spread the love