నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామ పరిధిలో ఎక్సెన్షన్ కెనాల్ కాలువ పొడగింపు తవ్వకాలు జరిగిన కాలువ పనుల మట్టి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో మట్టిని వ్యవసాయ పొలంలోకి లెవలింగ్, గృహ నిర్మాణాల కొరకు మట్టిని తరలిస్తూ మట్టిని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. నవతెలంగాణ చరవాణిలో కెనాల్ ఎక్సెన్షన్ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ అధికారి పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా కాల్వ తవ్వకాలు జరిపే భూమి యజమాని రైతులు వ్యవసాయ పొలాలకు తక్కువ మోతాదులో మట్టిని తీసుకెళ్లడం వల్లన ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కాకపోతే పరిమితికి మించి ఇష్టానుసారంగా పెద్ద మొత్తాన తరలించి దిగువన ఉన్న మట్టిని తరలిస్తే ముందస్తు రోజులలో నీటి ప్రవాహానికి కాలువలు గండి పడితే మట్టి వేయడానికి కనీసం మట్టి దొరకకుండా ఇబ్బందులు తలెత్తుతాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి ఇంటి నిర్మాణాలకు, కమర్షియల్ గా ప్రవేట్ వ్యక్తులకు అమ్మకాలు జరిపితే చర్యలు ఉంటాయని, కాల్వ ప్రాంతానికి చేరుకొని మట్టి తరలింపు నిలుపుదల చేస్తామని వారు తెలిపారు. అక్రమంగా మట్టి తరలించకుండా రెవెన్యూ సిబ్బంది, పోలీసులకు కూడా బాధ్యత ఉంది అని రైతులు తమకు సహకరించాలని కోరారు.