కళ్యాణం.. కమనీయం..

Marriage.. Marriage..– భక్తులకు ప్రత్యేక ఉచిత బస్సు సౌకర్యం
నవతెలంగాణ – ఉప్పునుంతల 
అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో చోళులనాటి కాలంలో పురాతన ఆలయంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేద పండితులు వరదరాజులు అయ్యగారు,సభ్యుల మంత్రోచ్ఛారణతో  కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయ చైర్మన్ వేముల నరసింహారావు నివేదిత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల నుండి ఆయా మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కళ్యాణమనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు చలమల గణేష్ గౌడ్, ఎలుక స్వరూప, తన్నోజు ప్రదీప్ ప్రసాద్, బుధగం శ్రీనివాస్ గౌడ్, చవ్వు కృష్ణయ్య కళ్యాణ మహోత్సవానికి సహకరించిన గ్రామ పెద్దలు మోహన్ గౌడ్ బలరావ్, సుదర్శన్, పానం సైదులు,వెంకటేష్, తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి, మండల నాయకులు అనంతరెడ్డి, అనంత ప్రతాప్ రెడ్డి,రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love