వేసవికాలం దృష్ట్యా అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పీ.కమాలాకర్ తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు తలెత్తితే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని బస్సు డిపోలో ఆర్టీసీ కార్మికులకు “అగ్ని ప్రమాదాలను నివారించే చర్యలు, గ్యాస్ సిలిండర్ల వినియోగం, అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల” పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్ లక్ష్మణ్, ఫైర్ మెన్లు సందీప్ రెడ్డి, కళ్యాణ్, నరేందర్, శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.