మైనార్టీ బిల్లుకు సిద్ద‌రామ‌య్య‌ ప్ర‌భుత్వం ఆమోదం

karnataka-assemblyన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. సామాజిక న్యాయం కోసమే ప్రభుత్వ కాంట్రాక్టులలో 4 శాతం ముస్లిం కోటాను ఆమోదించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా తీవ్ర గంద‌గోళం సృష్టించారు. స్పీకర్ పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కాగితాలు చించేసి స్పీకర్‌పై విసిరారు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. చట్టబద్ధంగా ఎదుర్కొంటామని బీజేపీ హెచ్చరించింది.

Spread the love