నవతెలంగాణ-మల్హర్ రావు : చిట్యాల మండలం కైలాపూర్ గ్రామపంచాయతీలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న జిల్లెల్ల కుమార్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందగా గురువారం మృతుని కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం పరమార్షించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేసీ చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ మేదర్ రాజేందర్, పర్సనల్ సెక్రెటరీ అజ్మీర్ భాష, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి కాజా, గ్రామ పంచాయతీ కారో బార్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, స్వీపర్లు తదితరులు పాల్గొన్నారు.