మనీ, మాఫియా, మీడియా, మద్యం గెలిచింది: కర్రోల్ల రవిబాబు

నవతెలంగాణ – మిరుదొడ్డి 
దేశంలో అగ్రవర్ణాలు గెలిచాయి  బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలు ఓడిపోయారని దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి ముఖ్య నాయకుల సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోల్ల రవిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలలో భాగంగా ఫలితాలపరంగా చూస్తే మళ్లీ అగ్రవర్ణ రాజకీయ పార్టీ లు గెలిచాయి. బీసీ, ఎసీ,ఎస్టీ మత మైనారిటీ ప్రజలు ఓడిపోయారు. భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులైన అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అనేక అందమైన అబద్ధాలతో, అలవి కాని హామీలతో మా బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ మరియు అగ్రకుల పేదలను మనీ, మాఫియా,మీడియా, మద్యం తో మభ్యపెట్టి అదేవిధంగా కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టి భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రచారం చేసి గెలిచారు.
అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అమాయకులైన మా సబ్బండ వర్గాల ప్రజలు ఓడిపోయారు అదే భారత రాజ్యాంగ మరియు ప్రజాస్వా వ్యతిరేక శక్తులు అయినా అగ్రకుల రాజకీయ పార్టీలె  విజయం సాధించాయి. ఏదేమైనా ఈ పార్లమెంటు ఎన్నికలలో ఈ మధ్యనే మహాత్మ జ్యోతిరావుపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ , కాన్షిరాముల ఆలోచనలో మరియు ఆ మహనీయుల రాజకీయ పోరాటంలో నుండి పురుడు పోసుకున్న ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగ విలువలను ప్రచారం చేసి ఓటు యొక్క ప్రాధాన్యతను, సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం అనే నినాదాన్ని విస్తృత ప్రచారం చేయడం జరిగింది.ఆ మేరకు ప్రజలు వారి విలువైన ఓట్లతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దేశంలో నూతన అగ్రవర్ణ ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రాజ్యాంగ విలువల ప్రకారం సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరిగనప్పుడు ధర్మ సమాజ్ పార్టీగా ప్రజా పోరాటాల నిర్వహిస్తామని రాబోయే దశాబ్ద కాలంలో తెలంగాణ గడ్డమీద ధర్మ సమాజ్ పార్టీ  బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించి భూతల స్వర్గాన్ని చూపెడతాం. ఏదేమైనా మేము ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాననే ఉంటాం అని తెలియజేయడం జరిగింది. *ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రసన్న,పరమేశ్వరి,డిబి.రాజు జిల్లా ఉపాధ్యక్షుడు చందు, దుబ్బాక మండల అధ్యక్షులు అనిల్, కనకమల్లేశం,మహేష్,ప్రవీణ్, చిన్న* తదితరులు పాల్గొన్నారు.
Spread the love