కార్పొరేట్ కు ధీటుగా బోధన.. ఆదర్శం కాటాపూర్ ప్రభుత్వ పాఠశాల 

– 11 మంది ఉపాధ్యాయులు 
– నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులు 
నవతెలంగాణ – తాడ్వాయి 
కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన జరుగుతుంది. ఆంగ్లంలో చదవడం రాయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల మాన్పించి ఆ సర్కార్ బడిలోనే చేర్పిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి పాఠశాల జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ పాఠశాల. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చల్లటి గాలి, పిల్లలతో సందడిగా కనిపిస్తున్న ఈ పాఠశాల ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామంలో ఉంది. పదవ తరగతి వరకు మొత్తం 149 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మంచి వాతావరణం ఆహ్లాదగ్గరంగా పరిసరాల తో పాటు పోటీ ప్రపంచంతో పరుగులు పెట్టేలా తల్లిదండ్రుల అభివృద్ధిలకు తగ్గట్టుగా ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధిస్తున్నారు. 11 మంది ఉపాధ్యాయులు పాఠశాల సమయంలోనే కాకుండా ప్రైవేట్ గా కూడా ట్యూషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అందుకే ఇక్కడ చదివిన విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ పాఠశాల విద్యార్థులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల గంగారం, దామెరవాయి, నర్సాపూర్ (పిఏ), పంబాపూర్ నాలుగు గ్రామపంచాయతీల విద్యార్థులే కాకుండా సరిహద్దు మండలాల విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా సాంకేతిక (టెక్నాలజీ) పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. విద్యార్థులు మంచిగా ఇంగ్లీషులో మాట్లాడేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా తాజా కూరగాయలతో ఆహారం వంటకాలు అందిస్తున్నారు. మండలంలో కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రధానోపాధ్యాయుడు గోరంట్ల రాజేష్
విద్యార్థులకు ఎప్పటికప్పటికి కోఆర్డినేషన్ లో ఉంటూ ప్రభుత్వ సహాయ సహకారంతో ఉన్నతమైన విద్యను అందేలా కృషి చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గ్రామస్తుల సహకారం కూడా చాలా బాగా ఉంటుంది.
Spread the love