కట్ట కృష్ణ సేవలు చిరస్మరణీయం..

– బీఆర్ఎస్ జిల్లా నాయకులు హరి శంకర్ గౌడ్ 
నవతెలంగాణ – బొమ్మలరామారం 
మాజీ సర్పంచ్ కట్ట కృష్ణ 7వ వర్ధంతి, బుధవారం మండల కేంద్రంలోని అయిన కుమారుడు కట్ట శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుధాగానీ హరి శంకర్ గౌడ్ వారి సేవలను కొనియాడారు. అనంతరం పార్టీలకతీతంగా కట్ట కృష్ణ గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పోలగౌని వెంకటేష్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, నాయకులు చీర సత్యనారాయణ, బోనకుర మల్లేష్, గణేశ్, నవీన్, జూపల్లి భారత్, రామకృష్ణ, పాచ్చా,రాజేష్ పైలెట్,నరేందర్ రెడ్డి, భాను, రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Spread the love