
నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండల కేంద్రంలో జడ్పీటీసీ శంకర్ నాయక్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలసి ఇంట్టింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగాసర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఏరాష్ట్రంలో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. కారుగుర్తుకుఓటువేసి సురేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు.