
మండల కేంద్రంలోని కేరళ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం కెండర్‌గార్డెన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలతో పాఠశాల సందడి వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులను చూసుకునే తీరును గూర్చి డ్రామా రూపంలో చిన్నారులు చేసిన నటన పలువురిని ఆకట్టుకుంది. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ వినయ్‌థామస్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, టీవీ, ఫోన్‌లాంటి వాటికి దూరంగా ఉంచాలని సూచించారు. తల్లిదండ్రులు కోరిన విధంగా ఉన్నత స్థానంలో చిన్నారులను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ బిజుసెల్వారాజ్, అకాడమీ ఇంఛార్జీ హన్సీ, ఉపాధ్యాయులు నర్సయ్య, రమ, అనూష, మమత, మాయదేవి, తదితరులు పాల్గొన్నారు.