నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని కిషన్ రావు పల్లి నుంచి అటవీప్రాంతంలో నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం జరుగుతుందని, ప్రతి పక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం అటవీశాఖ అధికారులు చెల్లించాల్సిన దాదాపు రూ.5 కోట్లు చెల్లిస్తోందన్నారు. తాడిచెర్ల, మల్లారం, కిషన్రావుపల్లి, పెద్దతూండ్ల,చిన్నతూండ్ల తదితర గ్రామాల ప్రజలు చిరకాల కోరికను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు త్వరలోనే తిరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.