బీఆర్ఎస్ బిచానా ఎత్తడం ఖాయమైపోయింది: కేకే మహేందర్ రెడ్డి

– కేటీఆర్ మనిషి మాట్లాడే భాష మాట్లాడు
– పట్టభద్రులను కించపరిచి మాట్లాడటం సరైనది కాదు కేటీఆర్
నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ పార్లమెంట్ ఫలితాల తర్వాత బిచానా ఎత్తివేయడం ఖాయమైందని, కేటీఆర్ ఇప్పటికైనా మనుషులు మాట్లాడే భాష మాట్లాడాలని, పట్టభద్రులను కించపరిచి మాట్లాడటం కేటీఆర్ కు సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈదురు గాలులకు ఏవైనా నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని ఆయన అన్నారు పదేళ్లు రాష్ట్రం ను పరిపాలించిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వద్దని ప్రజలు మార్పు కోరుకొని తీర్పు చెప్పారని అన్నారు ఆంధ్ర ప్రజలు తెలివి ఉన్నవాళ్లు అని జగన్ ప్రభుత్వం గెలిపిస్తారు అని ఆయన అనడం ఏంటని అంటే తెలంగాణ ప్రజలను నీవు ఏమన్నాట్లు అని ఆయన అన్నారు. తెలంగాణలోని విద్యార్థులకు యూనివర్సిటీలు పుట్టినిల్లు లాంటివని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కొరకు కేటీఆర్ తెలంగాణ పట్టభద్రులను కించపరచడం ఏంటని తీన్మార్ మల్లన్న కష్టపడి చదువుకున్నాడని, తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు నాంది అని నీ తండ్రి నిమ్మరసం తాగి ఉద్యమాన్ని విరమిస్తే తెలంగాణ లోని యూనివర్సిటీల విద్యార్థులు బలిదానం అయ్యారని దీంతోనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. తాడిత పీడిత ప్రజల పక్షాన తీర్మార్ మల్లన్న అండగా ఉంటున్నాడని, బడుగు బలహీన వర్గాలకు ప్రతీక తీన్మార్ మల్లన్న అని ఆయన అన్నారు. రైతు రుణమాఫీనీ గత ప్రభుత్వం ఎందుకు చేయలేదని, 3116 లు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ నీకు మాట్లాడే తెలివి లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వారిని బయటకు తీసుకు వస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేశారా అని గత ప్రభుత్వం ను ప్రశ్నించారు కరెంటు పోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం అని గాలివానతో కరెంటు పోతే టిఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా కేటీఆర్ పనికి రాడని ధాన్యం సేకరణ గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా కొనుగోలు చేశామని దొడ్డువాడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదని సన్న వడ్లను ప్రోత్సహించడానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని దీన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పిన మగాడు అని ఆయన అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ నువ్వు చేసింది ఏం లేదని అది ముందు తెలుసుకోవాలన్నారు. భూకబ్జాలను ఇసుక దోపిడీ అవినీతి నీ మాత్రం నీ ప్రభుత్వంలో అభివృద్ధి చేశారని అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మీరు శ్రీరంగనీతులు మానుకోవాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే పరిస్థితి మీకు వచ్చిందని స్థాయిని మరిచి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సిరిసిల్ల ఎమ్మెల్యేగా నీవు బతుకమ్మ చీరల డబ్బుల కోసం ఒక్కసారైనా ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అడిగావా అని ఆయన ప్రశ్నించారు. సిరిసిల్ల నేత పరిశ్రమ ను దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా ఉండేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు గడ్డం నరసయ్య వైద్య శివప్రసాద్ కత్తెర దేవదాసు గడ్డం కిరణ్ బైరినేని రాము తదితరులు పాల్గొన్నారు.

Spread the love