అత్యుత్తమ పనితీరు అవార్డుతో మెరిసిన కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఐఐటీ హైదరాబాద్‌ నిర్వహించిన పీఏఎల్‌ఎస్‌ హబ్‌ ఈవెంట్‌ వద్ద అత్యుత్తమ ప్రదర్శన అవార్డును అందుకోవడం ద్వారా మహౌన్నత విజయాన్ని సాధించినట్లు కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ వెల్లడించింది. పీఏఎల్‌ఎస్‌ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులు, అధ్యాపకుల అసాధారణ ప్రయత్నాలను అవార్డు ప్రధానోత్సవం సత్కరించింది. కేఎల్‌ డీమ్డ్‌ టూబీ యూనివర్శిటీకి చెందిన కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ తరపున కేఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణ ఆకెళ్ల అవార్డును ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాబిఎస్‌ మూర్తి నుంచి స్వీకరించారు. కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ దాదాపు 28 ఈవెంట్‌లలో చురుకుగా పాల్గొనడం ద్వారా ఈ గుర్తింపును పొందింది. ఇందులో ఎలక్ట్రికల్‌ వెహికల్‌ ఇండిస్టీ ఇన్‌సైట్‌లపై వర్క్‌షాప్‌ నిర్వహించడం సైతం వుంది. దీనికి పార్టనర్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో అపూర్వమైన ప్రశంసలు లభించాయి. సాంకేతిక సెమినార్‌లు, పారిశ్రామిక సందర్శనలు, కోడింగ్‌ హ్యాకథాన్‌లు, ఐడియా పిచింగ్‌, రెసిడెన్షియల్‌ వర్క్‌షా ప్‌లలో క్యాంపస్‌ ప్రమేయం ప్రశంసించబడింది. ముఖ్యంగా ఐడియా ప్రోటో టైప్‌ పోటీలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రీ-ఫైనల్‌ దశకు చేరుకుంది. కేఎల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్థసారధి వర్మ మాట్లాడుతూ..’ఈ గుర్తింపు మా విద్యార్ధులలో ఆవిష్కరణ పరిశ్రమ సంసిద్ధతను పెంపొందిం చడంలో మా శ్రేష్ఠత, అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. గ్రాడ్యుయేట్లు కేవలం పార్టిసిపెంట్స్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ సాంకేతిక రంగంలో నాయకులుగా ఉండే భవిష్యత్తును మా విశ్వవిద్యాలయం ఊహించింది. ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటమనేది ఆధునిక ప్రపంచంలోని సవాళ్లు, అవకాశాలను ఎదుర్కొనేందుకు విద్యార్థులు చక్కగా సన్నద్ధమవు తారని నిర్ధారిస్తుంది. ఈ విజయానికి సహకరించిన మా అధ్యాపకులు, విద్యార్థులు, భాగస్వాముల గురించి మేము చాలా గర్విస్తున్నాం. మా అద్భుత మైన ఆవిష్కరణల ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎదురుచూ స్తున్నామని అన్నారు.

Spread the love