కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం..

The services of KNR Trust are commendable..– విద్యార్థులలకు పరీక్ష సామాగ్రి అందజేత..
నవతెలంగాణ – సారంగాపూర్
కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, దశరథ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు అన్నారు. మండలంలోని జామ్ గ్రామానికి చెందిన కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది నెలకొల్పిన కొర్వ నవీన్ రామ క్రిష్ణ రెడ్డి ట్రస్ట్ (కెఎన్ఆర్) జాం/ హైదరాబాద్ గార్ల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంతోపాటు కౌట్ల(బి),మలక్ చించోలి గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు,ఇంగ్లీష్ డీ క్షణరీ లు పరీక్ష సామాగ్రి అందజేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడారు..సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలు ప్రగతి బాట పడతాయని అన్నారు.కాంగ్రెస్ నాయకులు కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది కెఎన్ఆర్ ట్రస్టు అందించిన సహకారాన్ని అందిపుచ్చుకొని ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ సందర్బంగా పాఠశాల తరుపున కెఎన్ఆర్ ట్రస్టు సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒలత్రి నారాయణ రెడ్డి,జగదీష్,లక్ష్మన్,సత్యం, భోజన్న,రమేష్,పోత రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love