కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి: నేర్లకంటి రవికుమార్

నవతెలంగాణ – చండూర్
ఇటీవల జరిగిన  ఎంపీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి  గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపు బాధ్యతని భుజాలపై వేసుకొని అత్యధిక మెజారిటీ తో ఎంపిని గెలిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని చామలపల్లి మాజీ ఎంపీటీసీ నేర్లకంటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. బుధవారం అని విలేకరులతో మాట్లాడుతూ..  తెలంగాణ సాధనలో లో ఒక ఎంపీగా కీలక భూమిక నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కల సాకారం చేయడమే కాకుండా, తెలంగాణ మొత్తం కెసిఆర్ గాలి విచినా కూడా ఒకసారి ఎమ్మెల్సీ గా.. ఒకసారి ఎమ్మెల్యే గా.. భారీ మెజారిటీ తో గెలిచి అప్పట్లోనే కెసిఆర్ కు తన సత్తా చూపాడు..కరోనా మహోమ్మారి సమయంలో ప్రతి గడపకు నిత్యావసర సరుకులు పంపించిన రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమం పెట్టి ఎంతో మంది ఆబాగ్యులకు ఆశ్రయం కల్పించిన గొప్ప మానవతావాది. అంతేకాదు 2018లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యే లు కెసిఆర్ కు అమ్ముడుపోయినా కూడా తాను మొండి పట్టుదలతో కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని.. కెసిఆర్ కుటుంబ పాలననుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ గడ్డపై ఎగురవేయుటలో ముఖ్య పాత్ర పోషించాడు.
Spread the love