రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కోన సముందర్ విద్యార్థి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి రాజేశ్వర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ తెలిపారు. ఈనెల 7వ తేదీన నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ, ఎంపిక పోటీలు ముప్కాల్ మండలంలో జరిగాయి. ఇందులో విద్యార్థి జి. రాజేశ్వర్ కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు  ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మధుపాల్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి రాజేశ్వర్ తోపాటు కోచ్ ను అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love