గెలిచిన ప్రాతినిధ్య సంఘాలకు సర్టిఫికెట్లు అందజేయాలి: కోట రవీందర్ రెడ్డి 

నవతెలంగాణ – రామగిరి 
ఆర్.జి.3 ఏరియాలోని సెంటినరీ కాలనీ ఐఎన్టియుసి శ్రీపాదభవన్లో ఐఎన్టియుసి ఆర్ జి-3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యూనియన్ ఎన్నికలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గెలిచిన ప్రాతినిద్య సంఘం లేఖ రాకపోవడం బాధాకరమన్నారు, ఆ లేఖ రాకపోవడంతో కమిటీలు వేయడం లేట్ ఆవుతుందినీ, అయినప్పటికీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో ఎస్సిఎంఎల్యు సెక్రటరీ జనరల్  బి జనక్ ప్రసాద్ ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లీ డిపెండెంట్ ఉద్యోగుల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు పెంచడంలో, ప్రజా ప్రభుత్వ ఏలుబడిలో సింగరేణికి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా మూడు నెలల కాలంలో అనేక సంచలనాత్మక నిర్ణయాలు సుమారు వెయ్యి ఉద్యోగ నియామకాలు, కొత్తగనులకు శ్రీకారం థర్మల్ సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు. ఏర్పాటు కొరకు మాట్లాడినటువంటి ఘనత ఐఎన్టియుసిదని కొనియాడారు.అలాగే మందమర్రికి స్కిల్ డెవలప్మెంట్సెం టర్ ఏర్పాటు చేయటం , సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద భీమా కోసం బ్యాంకర్ల తో అగ్రిమెంట్ చేయటం ,  ఈ విధంగా ప్రజా ప్రభుత్వ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సింగరేణి కార్మికుల పట్ల సంస్థ పట్ల అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై యావత్ సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. అలాగే ఏరియాలోని ఓసిపి-1,2 సి హెచ్ పి ఏఎల్ పి పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సెంట్రల్ నాయకులు గడ్డం తిరుపతి యాదవ్, బ్రాంచ్ కార్యదర్శలు   నరెడ్ల శ్రీనివాసరావు, సత్రం సమ్మయ్య, సాయికృష్ణ, డి మంగయ్య, కిషన్ నాయక్, వెంకటస్వామి, కొమురయ్య, రాళ్ల బండి రవీందర్, శ్రీనివాసచారి, సమ్మిరెడ్డి, పెద్ది సమ్మయ్య, ఎన్ కె పాటిల్, ఎండి కాసిం, రమేష్, బుద్ధి సదానందం, ఎ సురేష్, అంజయ్య, ఆర్ ఎల్ రాహుల్  పాల్గొన్నారు.
Spread the love