కృష్ణమాచార్యుల శత జయంతి సభ..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
కళా మంజరి, నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, అవధాని నల్లాన్ కృష్ణమాచార్యుల శత జయంతి సభ తెలంగాణ సారస్వత పరిషత్తు అడిబోరియంలో నిర్వహించారు. సాహితీ, సంగీత సమార్చన శీర్షికన నిర్వహించిన అష్టావధానంలో అవధానులు యజ్ఞం శెట్టి ఉమామహేశ్వరరావు,  శ్రీరామ చక్రవర్తి. డాక్టర్ ఆచార్య ఫణీంద్ర సందేహాలను పూరించి నివృత్తి చేశారు. కృష్ణ మాచార్యుల శిష్య బృందం పలుకీర్తనలను గానం చేసి ప్రశంసలందుకున్నారు. అనం తరం జరిగిన సభలో విశ్రాంత ఐఏఎస్ అధి కారి డాక్టర్ కె.వి. రమణాచారి, అవధానులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు, డాక్టర్. జి.ఎం. రామశర్మ, మరుమాముల వెంకటర. మణ శర్మ పాల్గొని కృష్ణమాచార్యులు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వర్త లను ఘనంగా సన్మానించారు. కార్యక్ర మాన్ని వేమరాజు విజయకుమార్ సమ న్వయం చేశారు.
Spread the love