చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆర్మీ జవాన్ లక్ష్యానాయక్

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం సాగర్ తిరుమల గిరి మండలం జమ్మనకోట తండలో గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమావత్ లక్ష్యానాయక్ శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఒక వైపు దేశ భద్రత లో అహర్నిశలు శ్రమిస్తూనే మరొక వైపు గ్రామం లో సేవాకార్యక్రమాలు చేపడుతూ అందరికి ఆదర్శంగానిలిచారు. వేసవి కాలంలో దాహర్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల దాహర్తిని తీరుస్తున్నారు. ఈ సందర్బంగా ఆర్మీ జవాన్ మాట్లాడు తూ గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి 35 నుంచి 40 డిగ్రీలు దాకా పెరిగిపోతోందని గ్రామం లో తాగునిటీ ఎడ్డది నెకొందని అన్నారు.అందుకే నావంతు ఈ వేసవిలో తాండవాసులకు చలివేంద్రం ద్వారా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్ గా  దేశభద్రత కోసం డ్యూటీ చేస్తూనే మరో వైపు  ఆయనకి సెలవలు దొరికినప్పుడల్లా అప్పుడు అప్పుడు సామాజ సేవ చేస్తూ ప్రజల్ని ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే అతను ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం పై గ్రామస్తులు హర్షము వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రమావత్ శివ,రమావత్ ముని,రమావత్ రమేష్, మేరావత్ మహేష్, రమావత్ సుమన్, రమావత్ బాలాజీ,మరియు గ్రామ ప్రజల పాల్గొన్నారు.
Spread the love