నవతెలంగాణ-హైదరాబాద్: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల అగ్నిమాపక దళం ,వయనాడ్ జిల్లా పోలీస్ చీఫ్‌లను ఆదేశించారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ ధృవీకరించారు. బాధితులకు చికిత్స అందించేందుకు వయనాడ్‌లోని ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి రక్షించబడిన ఎనిమిది మందిని – చికిత్స కోసం మెప్పాడిలోని WIMS ఆసుపత్రికి తరలించారు. చులిక్క ప్రభుత్వ ఎల్.పి. (LP) పాఠశాలలో ఒక సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభావిత ప్రాంతంలోని ఇళ్లలో నివసిస్తున్న వారిని అక్కడికి తరలిస్తున్నారు.
కాగా,నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపొయిల్-కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

:



