నవతెలంగాణ – జన్నారం
ప్రాథమిక పాఠశాల కిష్టాపూర్ లో దిక్సూచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో నివాసం ఉంటున్న నోముల రంజిత్ పాఠశాలకు శుక్రవారం లాప్టాప్, ప్రొజెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో విద్యార్థులకు స్టెమ్ (STEM) అనగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ పై ఎక్కువ దృష్టి పెడతారన్నారు. అదే విధానాన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అమెరికా నుండి ఆన్లైన్ నేర్పిస్తానని చెప్పారు. విద్యార్థులు ట్రడిషనల్ విద్యాతో పాటు టెక్నికల్ విద్యను నేర్చు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ పిల్లలకు చిన్న నాటి నుండి సైన్స్ పట్ల అవగాహన ఉండాలని, మూడ నమ్మకాలాను నమ్మ కూడదని చెప్పారు. ప్రతి విద్యార్థి సైన్స్ టెంపర్ కలిగి ఉండాలని నేటి బాలలే రేపటి సైంటిస్ట్ లు అన్నారు. ప్రొజెక్టర్ లాప్టాప్ అందించిన దిక్సూచి ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామటెంకి శ్రీనివాస్,CH లక్ష్మయ్య ,మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ లు స్వరుప,వనిత లు మరియు VV లు గీతా, స్వరూప లు మరియు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.