ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

– వివిధ సమస్యల సత్వర పరిష్కారం.
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ను ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, సి.ఈ. ఓ అప్పారావు తో కలసి ఎలక్షన్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెల్ నందు సి.విజిల్, 1950 కాల్ సెంటర్, సువిదా పర్మిషన్స్, ఎన్ జి ఆర్ పి ఎస్ పోర్టల్ అలాగే పీడబ్ల్యూడి సాక్షమ్ యాప్ అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లా ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో పలు సమస్యలు జరిగే సంఘటనలు పై సత్వరమే పరిష్కార దిశగా సంబంధిత యాప్ ను అందుబాటులో ఉంచాని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంట్రోల్ రూమ్ నందు సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించామని ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, ఈడీఎం గఫార్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love