28న లాసెట్‌ నోటిఫికేషన్‌

– మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ :షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఓయూ వీసీ డి రవీందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ బి విజయలక్ష్మి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 28న లాసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని విజయలక్ష్మి తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. ఆలస్య రుసుంతో అదేనెల 25 వరకు సమర్పణకు అవకాశముందని తెలిపారు. జూన్‌ మూడో తేదీన లాసెట్‌ రాతపరీక్షలుంటాయని వివరించారు.

Spread the love