రైతాంగ, కార్మికుల హక్కుల రక్షణకై ఐక్య పోరాటాలు నిర్వహిద్దాం..

– మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే దాకా కొట్లాడుదాం
– వామపక్ష పార్టీల నాయకుల పిలుపు
– జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు, అనుబంధ సంఘాలతో పాటు బీఆర్‌ఎస్‌ కార్మికసంఘం ఆద్వర్యంలో వేరువేరుగా నిరనలు తెలిపారు. రైతాంగ,కార్మికుల హక్కుల రక్షణకై ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే దాకా కొట్లాడుదామని  ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథ) పార్టీ అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలలిపారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రైతాంగానికి,కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి  ఒక్క హామిని  అమలు చేయలేదన్నారు. వాటిని అమలు చేయకపోగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని ఆదాని, అంబానీలకు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాడని, రైతాంగాన్ని నిండా ముంచాడని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్లు్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్‌ కుమార్, ప్రజాఫ్రంట్‌ జిల్లా కన్వీనర్‌ కోటయ్య,
తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆద్వర్యంలో: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ధర్మభిక్షం భవన్‌ వద్ద  అఖిల భారత రైతు సంఘం, ఎఐఎస్‌ఎఫ్, ఎఐటియుసి, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్, ఎఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు , ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా  ఐక్యంగా పోరాటవలసిన అవసరం వుందని అన్నారు. హిట్‌ అండ్‌ రన్‌ చట్టం తీసుకుని రావడం వలన వాహన ప్రనాదాలలో డ్రైవర్‌ కు పదిలక్షల రూపాయల జరిమానాతో పాటు  ఏడు సంవత్సరాల కారాగార శిక్షను అమలుచేసే చట్టాలను తక్షణమే ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ  నాయకురాలు అనంతుల మల్లీశ్వరి, హెచ్‌పిసిఎల్‌ ఆయిల్‌ ట్యాంకర్స్‌ డ్రైవర్లు మరియు వర్కర్లు , ఎఐకెఎస్, ఎఐవైఎఫ్, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.
న్యూ డెమోక్రసీ ఆద్వర్యంలో: దేశాన్ని లూటీ చేసిన మోడీని గద్దె దించే వరకు పోరాడాలని కోరుతూ  న్యూడెమోక్రసీ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నుండి కొత్త బస్టాండ్‌ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం .డేవిడ్‌ కుమార్‌ ,ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్యలు మోడీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు  అమ్మేస్తూ  లూటీ చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని  లు కార్మిక,రైతు వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు,  సామ నర్సిరెడ్డి, మూరగుండ్ల మధు,అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బోల్లే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love