నవతెలంగాణ – సారంగాపూర్
మహనీయుల ఆలోచనలను కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ లు అన్నారు. శుక్రవారం మండలంలోని యాకర పల్లె,గొడిసర గ్రామాల్లో కాంగ్రెస్ చేపట్టిన జే బాపు, జై భీమ్, సంవిధాన్ కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లోని మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు.. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యంరెడ్డి,నాయకులు నవీన్ రెడ్డి,ముత్యం రెడ్డి, ఉట్ల రాజేశ్వర్, సత్యపాల్ రెడ్డి,రమణ యాదవ్,సత్యం,భోజన్నా,గణేష్, సురేందర్ , పాల్గొన్నారు.