కలిసికట్టుగా వేములవాడను అభివృద్ధి చేసుకుందాం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

– పలు సంఘాల ఆత్మీయ సమ్మేళన లో పాల్గొన్న ఆది
నవతెలంగాణ – వేములవాడ
కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని 14  కుల సంఘ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.. ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిసారి కుల సంఘాల్లోకి వచ్చినందుకు ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు. మహాలక్ష్మి వీధిలోని శాలివాహన సంఘం, శ్రీ మహాలక్ష్మి ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో నా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు నాకు ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారని అన్నారు. నా ఎమ్మెల్యే పదవిని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశానన్నారు. మనమందరం కలిసికట్టుగా ఉంటూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, బైరి సతీష్, పుల్కం రాజు,తూ మధు, పులి రాంబాబు గౌడ్, ముంజ ఉమేందర్, పిల్లి రాజేందర్ వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love