డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం.. భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం..

– డ్రగ్స్ నిర్ములన పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
– జిల్లా కేంద్రంలో ఉత్సాహకంగా సాగిన అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – సిరిసిల్ల
డ్రగ్స్ మహమ్మారి నీ నిర్మూలించాలని భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత/విద్యార్థులతో కలసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా గాంధీ మీదుగా మరక కళాశాల గ్రౌండ్ వరకు బుధవారం ర్యాలీ కొనసాగింది.ప్రత్యేక ఆకర్షణగా మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డులు, కళాశాల మైదానంలో  ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ  అఖిల్ మహజన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం అని ఎస్పీ  పిలుపునిచ్చారు.యువత గంజాయి లాంటి  మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు.సమాజంలో ప్రభుత్వం నిషేధించిన  మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత,ప్రజలు పోలీసువారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పెరు తీసుకరవాలని అన్నారు.జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో  అవగాహన ర్యాలీలు చేపట్టి పెద్దఎత్తున విద్యార్థులకు,యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.గంజాయి లాంటి మత్తుపదార్థాలకు సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా డయల్100 లేదా మీ పరిధిలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు రఘుపతి, మాధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్,జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజాం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ,పోలీస్ సిబ్బంది, పలు పాఠశాలల,కళాశాల ఉపాధ్యాయులు , విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

Spread the love