స్త్రీ, పురుష సమానత్వం కై పోరాడుదాం..

– స్త్రీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
– ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పగిడి పాల తిరుపతి అక్క 
నవతెలంగాణ – నెల్లికుదురు
శ్రీ పురుష సమానత్వం కై పోరాడుదాం స్త్రీలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరం అరికడదామని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పగిడి పాల తిరుపతి అక్క తెలిపారు. తొర్రూరు డివిజన్ మహాసభ శుక్రవారం నెల్లికుదురు మండలంలోని సౌల తండా గ్రామపంచాయతీ శివారు శనగకుంట తండాలో కామ్రేడ్ అనుసూర్య అక్క నగర్ ఆలకుంట్ల దర్గమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు పగిడి పాల తిరుపతి అక్క మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటిని  అరికట్టడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా పసిపాపల పైన ఆదివాసి దళిత బలహీన వర్గాల మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రభుత్వాలకు సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన తిరిగి పునరావృత్తం అవుతున్నాయని వారన్నారు. మహిళలపై వివక్షత దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వానికై మహిళలందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇలా జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి వారిని కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు సామ రజిత ఎస్ కవిత, ఎండి కవిత, కత్తుల ఉపేంద్ర, ఉడుగుల కనకమ్మ, ఐలమ్మ, భూలక్ష్మి, బుజ్జి, మంగమ్మ, రామ భద్రమ్మ, అరుణ, మంజుల, కాంతమ్మ, సరోజన  తదితరులు పాల్గొన్నారు.
Spread the love