– ‘జన జాగరణ’లో నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ప్రజా సంఘాలకు చెందిన పలువురు నేతలు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్), కార్మిక సంఘాల జాతీయ పిలుపులో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి సుందరయ్య పార్కు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్‌కేఎమ్, కార్మిక సంఘాల నాయకులు టి.సాగర్, పాలడుగు భాస్కర్, బాలరాజ్, రెబ్బా రామారావు, శివబాబు, ఆర్‌టీ చంద్రశేఖర్, అంజద్‌ఖాన్, సూర్యం, అనురాధ, జె.వెంకటేశ్, ఎమ్.వెంకటేశ్, బొప్పని పద్మ, కుమార్, యాదగిరి, ఎస్‌ఎల్ పద్మ, హన్మేశ్, మోహన్, మహేందర్, ప్రదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.