రాష్ట్ర ప్రభూత్వం ఆటవి శాఖ ఆధ్వర్యంలో చేపడపతున్న మన వనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలు, గ్రామపెద్దల యువజన సంఘాలతో మమేకమై విజయవంతం చేయాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనీవాస్ అన్నారు. బుదువారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో వారాంతపు ఉపాదీహమీ సిబ్బంది, జీపీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సమావేశంలో మాట్లాడుతు సిబ్బందికి ప్రతి ఒక్కరు కష్టపడాలని, గ్రామాలలో ఇంటింటికి తిరుగి మెుక్కలను పంపిణి చేసి వాటిని నాటించి, సంరక్షణ బాద్యత వారే తీసుకునే విధంగా అవగాహన పర్చాలని సూచించారు. అదేవిధంగా హోమ్ స్టేడ్, పిట్టింగ్ , ప్లానింగ్ , రెండు రోజులలో పూర్తీ చేయాలని గ్రామస్థాయి అధికారులకు ఎంపిడివో ఆదేశించారు. వజ్రఖండి, సావర్ గావ్, ఖండేబల్లూర్ గ్రామపంచాయతి గ్రామాలలో ఎంపిడివో సందర్శించి ఏఏపీ, ఈజీఎస్ పనులను క్షేత్రస్థాయిలలో పరీశీలించి కూలీల కు కల్పిస్తున్న సౌకర్యాలును వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజ్, ఉపాదీహమీ ఇంచార్జీ ఏపీవో ఈసీ స్వామీదాస్ , అన్ని గ్రామాల కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.