స్వచ్చదనం -పచ్చదనం ను విజయవంతం చేద్దాం: ఎంపీడీఓ

Cleanliness - Let's make green a success: MPDO– ఏఈ, గ్రామ ప్రత్యేక అధికారి దీప్ చంద్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీలో ఈ నేలా 05 నుండి 09 వరకు నిర్వహించే స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అర్ డ్లు ఎస్ ఏఈ , గ్రామ ప్రత్యేక అధికారి దీప్ చంద్, ఎంపిడిఓ అనంత్ రావు లు సూచించారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి,గన్నరం, నల్లవెల్లి గ్రామ పంచాయతీలలో గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పచ్చదనాన్ని పెంపొదించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడానికి 05 నుండి 09 వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. అందుకోసం ప్రతిరోజూ పల్లె ప్రాంతాలలో క్రమపద్ధతిలో పరిశుభ్రత చేపట్టుటకు, గృహ స్థాయి, కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు నిరంతర ప్రాతిపదికన ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సూచనలు జారీ చేశారన్నారు. 5న స్వచ్ఛదనం పచ్చదనం స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలు, గ్రామ పంచాయతీ కమిటీతో సమావేశం నిర్వహించి, ర్యాలీ నిర్వహించాలని, గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వీధి కుక్కల బెడదపై  ఐఈసి క్యాంపెయిన్ నిర్వహించడం, ఇంటి స్థాయి నుండి చెత్తను తడి & పొడి చెత్త గా వేరు చేయాలన్నారు.
ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచటం లో భాగంగా మొదటి రోజు గ్రామం లోని అన్నీ ప్రభుత్వ ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల పరిసరాలను శుభ్రం చేయాలని, ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసిన వ్యర్థాలను సేకరించడం, తడి చెత్తతో విధిగా కంపోస్టు ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాలన్నారు.పాఠశాలల్లో వాలంటీర్లను ఆహ్వానించి వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకంపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు.ప్రతిరోజూ ప్రాంతాల వారీగా వీధులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం చేపట్టాలని, చెత్త ఎక్కువగా పొగు అయ్యే ప్రదేశాల పై దృష్టి సారించాలని సూచించారు.అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్ వాడీలు, హాస్టళ్లు, పీ.హెచ్. సీలు, బస్టాప్ లు మొదలైనవాటిని శుభ్రం చేయించాలన్నారు.గ్రామీణ ప్రాంతంలో పారిశుధ్య వాహనాలన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు చేయాలని కోరారు. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి వాల్ పెయింటింగ్స్ చేపట్టాలని వివరించారు. పిచ్చి మొక్కలు తొలగించి, ప్రజల చేత శ్రమదానం చేయించే విధంగా చూడాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో (ఐహెచ్ హెచ్ ఎల్) వ్యక్తిగత మరుగు దొడ్లు లేని కుటుంబాలను గుర్తించి ఐహెచ్ హెచ్ ఎల్ లను నిర్మాణం (15) రోజుల్లో పూర్తి చేయించేందుకు కృషి చేయాలన్నారు.ఎంజిఎన్అర్ ఈజి ఎస్ అధికారులతో కలసి, ఎంపిక చేసిన ప్రదేశం లో అవెన్యూ ప్లాంటేషన్ చేయించాలని అదేశించారు. ఈసమావేశంలో గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ దర్పల్లి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్,కరోబర్ నరేందర్, విడిసి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love