కొత్త ప్రాంతంలోకి ఎల్‌ఐసి ఎంఎఫ్‌ కార్యాలయం

కొత్త ప్రాంతంలోకి ఎల్‌ఐసి ఎంఎఫ్‌ కార్యాలయంహైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలాయన్ని మరో చోటుకు తరలించినట్లు ఎల్‌ఐసి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వెల్లడించింది. సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ రోడ్‌ వివి వింటేజ్‌ బౌలేవార్డ్‌కు మార్చినట్లు తెలిపింది. దీన్ని మంగళవారం ఎల్‌ఐసి మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌కె ఝా లాంచనంగా ప్రారంభించారు. ఇది తమ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా గణంకాల ప్రకారం.. 2023 డిసెంబర్‌ 31 నాటికి ఈ రంగంలో రూ.50.77 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల నుంచి రూ.1.43 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే రూ.1 లక్ష కోట్ల ఎయుఎం ఉంటుందన్నారు.

Spread the love