సాహితి స‌మాచారం

సోమేపల్లి వెంకటసుబ్బయ్య స్మారక సంకలనానికై రచనలకు ఆహ్వానం
సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి వర్థంతి సందర్భంగా వెలువరించబోయే ప్రత్యేక సంకలనానికై రచనలను ఆహ్వానిస్తున్నాం. సోమేపల్లితో వున్న అనుబంధాల్ని, సందర్భాలను వ్యాసాలుగా, కవితలుగా చేసిన రచనలను, ఫొటోలను నవంబరు 20 లోపు ఈమెయిల్‌: [email protected] లేదా 8074779202 నెంబరుకు వాట్సాప్‌ లేదా రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 చిరునామాకు పంపగలరు.
– సోమేపల్లి లిటరరీ ఫౌండేషన్‌

నవంబర్‌ 3న కవిసమ్మేళనం
తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, తెలుగు భాషా సంస్కృతి శాఖ సంయుక్త నిర్వహణలో నవంబర్‌ 3న మధ్యాహ్నం 2గం.లకు రవీంద్ర భారతిలో కవి వారం-కవిత్వ తరగతి, కవి సమ్మేళనం జరుగుతుంది. ఈ సభలో నందిని సిధారెడ్డి ‘వర్తమాన జీవితం – వచన కవిత నిర్మాణం’ అంశం మీద ప్రసంగిస్తారు. కందుకూరి శ్రీరాములు, మామిడి హరికృష్ణ, బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ పాల్గొంటారు. 39 మంది కవులు తమ కవిత గానాన్ని వినిపిస్తారు.
– కందుకూరిశ్రీరాములు, అధ్యక్షుడు, తెలంగాణ రచయియల సంఘం

మండల స్వామి సంస్మరణ సభ
దివంగత కవి రచయిత డా.మండల స్వామి సంస్మరణ, మిత్రులచే స్వామి కవిత్వ పఠనం ఈ నెల 30న సాయంత్రం 6.00 గం.లకు హైదరాబాద్‌ కవుల వేదిక సమావేశ మందిరం, విజయశ్రీ కాలనీ కమ్యూనిటీ హాల్‌, వనస్థలిపురంలో జరుగుతుంది. మండల స్వామి మిత్రులందరికీ ఆహ్వానం.
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183

Spread the love