బాదిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

LoC issued to the victim's familyనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని పడకల్ గ్రామంలో గల చమ్మటి సత్యనారాయణ కొడుకు రుత్విక్ రాజ్ అనారోగ్యంతో బాధపడుతున్న సీఎం సహాయ నిధులతో రూ.40,000  ఎల్ఓసీని బాధితుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు జితేష్ అందజేశాడు.  ఈ సందర్భంగా వారి కుటుంబం డాక్టర్ భూపతి రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడకల్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు ఇర్ల జితేష్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ నాయకుడు కొప్పుల మహిష్ మరియు నాయకులు పాల్గొన్నారు.
Spread the love