గచ్చిబౌలిలో ఒరిగిన భవనం భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్‌ : గచ్చిబౌలి సిద్దిఖ్‌ నగర్‌లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్‌ డివిజన్‌ సిద్దిఖ్‌నగర్‌లో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరగటంతో అందులో నివాసముంటున్న వారితో పాటు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్‌ కోసం తవ్విన గుంతకారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఏ క్షణంలో భవనం కూలుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

Spread the love