కాంగ్రెస్ పార్టీలోకి చేరికల కోసం ఎదురుచూపులు

నవతెలంగాణ – నూతనకల్
రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు షురు కావడంతో ప్రాంతాలలో 15లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల చేరికలపై అయి ఇష్టత వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిక విషయం “మింగు అంటే  కప్పకు కోపం , వదులేయి అంటే పాము కు కోపం లాగా మారింది పదేళ్లుగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీలో ఉండి మళ్లీ చేరితే వారిదే పెత్తనం ఉంటుందని పలువురి అభిప్రాయం కాబట్టి చేరిక ఉత్తర లేక చేర్చుకోలేక  చేరికలు మొదలుపెడతలేరు. అయినా కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికలలో అయా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, బీజేపీ లను బలహీనపరిచే అందుకు ఆ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి గత ఉద్యమ కాలం నాటి మిత్ర నాయకులతోపాటు మరి కొంతమందిని చేర్చుకునే ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు ఇతర పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా చేర్చుకొని పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో కల్పించాలనేదే ముఖ్య ఉద్దేశం.
కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచి ఉంది
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గేట్లు తెరిచేది ఎప్పుడు. తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఎవరు సాధించని అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామిల్ రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ బీజేపీకి  చెందిన నాయకులను కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బలోపేతం చేయాలి.  దానిలో భాగంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేరికల గేట్లు ఎప్పుడు తెరుస్తారో అని  బీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. రానున్న ఎంపీ ఎన్నికలలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటదనేది ఓటర్ల అభిప్రాయం. దేనిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా  బీఆర్ఎస్  నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఎదురుచూస్తున్నారని నాయకుల అభిప్రాయం.
బీఆర్ఎస్  మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులే చేరికలో ముందు వరుసలో
ప్రత్యేక రాష్ట్రంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో  ఉన్న మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మండల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మందు వరుసలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే అధికారం లేకపోవడాన్ని జీర్ణించుకోలేక  రాజనీతిని మరిచి ప్రజల అభిప్రాయాలను పక్కకు పెట్టి అధికార ప్రయోజనాల కోసం స్వలాభం కోసం, కాంట్రాక్టు, అక్రమ వ్యాపారాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కారు దిగి కాంగ్రెస్ లోకి చేరిడం కోసం కాంగ్రెస్ ప్రజాపతినిధులతో ఉన్న గత సంబంధాలతో రహస్య మంతనాలు నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Spread the love