– చిన్నవంగర లోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – పెద్దవంగర
శివ నామస్మరణతో పెద్దవంగర మండలం మారుమోగింది. బుధవారం మహా శివరాత్రి కావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని శివాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. పెద్దవంగర గ్రామంలోని పార్వతి రామలింగేశ్వర స్వామి, చిన్నవంగర లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తజనసంద్రంగా మారింది. వందల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో ఎర్రబెల్లి పూజలు
చిన్నవంగర గ్రామంలోని పురాతన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం పట్ల వారిని అభినందించారు. కార్యక్రమంలో పాకనాటి లక్ష్మారెడ్డి, ముద్దసాని పుల్లారెడ్డి, పాకనాటి అజిత్ రెడ్డి, పాకనాటి సునీల్ రెడ్డి, పాకనాటి శేఖర్, విజయ్ పాల్ రెడ్డి, నగేష్, ఈదురు ఐలయ్య, శ్రీరాం సంజయ్, శ్రీరాం సుధీర్, రాము, యాకయ్య, శివరాత్రి సోమనర్సు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.