నగరంలో మహారాష్ట్ర టూరిజం రోడ్‌షో..

నగరంలో మహారాష్ట్ర టూరిజం రోడ్‌షో..హైదరాబాద్‌ : మహారాష్ట్ర టూరిజం అండ్‌ ట్రావెల్‌ సోమ వారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించింది. తమ ప్రదర్శనకు భారీ స్పందన లభించిందని ఆ రాష్ట్ర పర్యాటక విభాగం కార్యదర్శి జయశ్రీ భోజ్‌ తెలిపారు. ఈ షోకు నగరంలోని పర్యాటక రంగంలోని ప్రముఖులు హాజరయ్యారని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో అనేక అధ్యాత్మిక కేంద్రాలు సహా ప్రకృతి అందాలు నెలువై ఉన్నాయన్నారు. అంతరాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించా లనేదే తమ లక్ష్యమన్నారు. తాము దేశంలో నిర్వహిస్తున్న రోడ్‌షోలకు గొప్ప స్పందన లభిస్తుందన్నారు.

Spread the love