మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని గాంధీనగర్ లో మంగళవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో  యువత ముందుకు నడవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఊట్నూరి ప్రదీప్, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, శంకర్, సుంకరి రాజేశ్వర్, గణేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love