మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఏర్పాట్లను పరిశీలన

నవతెలంగాణ – భువనగిరి
ఈనెల11న  భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే 198వ  జయంతి వేడుకల పనులను  జిల్లా బిసి  సంక్షేమ అధికారి యాదయ్య , మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల కమిటీ, బిసి సంఘాల నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని జగదేవ్ పూర్ చౌరస్తాలో గల  మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహానికి రంగుల పనులను, స్టేజి ఏర్పాట్లను పరిశీలించారు, ట్రాఫీక్ కు ఇబ్బంది జరగకుండా చూడాలని ఆయన కోరారు.  ఎండాకాలం కావడంతో టెంట్ ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, కూలర్లు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేష్, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్, కాత్త బాలరాజు, కొత్త నర్సింహ స్వామి, సిరికొండ శివ కుమార్, చిన్నగారి కృష్ణ,  జూకంటి ప్రవీణ్ కుమార్, చొల్లేటి గోవర్ధన్ చారి  పాల్గొన్నారు.
Spread the love