గ్రామీణ భారత్ బందును విజయవంతం చెయ్యండి: వేల్పూర్ భూమయ్య

నవతెలంగాణ – మోపాల్
రైతు ఉద్యమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముక్యంగా ఎం ఎస్ పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకరావాలని. రైతులపై మోపిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహారించాలని, భారత రైతుల అప్పులను మాఫీ చేసి రైతులను రుణ విముక్తిల్ని చేయాలనీ, తదితర డిమాండ్స్ తో రేపు శుక్రవారం రోజున భారత్ బందులో భాగంగా గ్రామీణ బందును విజయవంతం చేయాలనీ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు భూమయ్య మరియు తెలంగాణ రైతు సంగం అధ్యక్షులు ఎ రాజేశ్వర్ తెలిపారు. గురువారం రోజున తాడేం గ్రామంలో కరపత్రాలు పంచుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రైతులతో కలిసి సమావేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా  జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య,రైతు సంఘం అధ్యక్షులు ఎ ఐ కె యేం యస్, రాజేశ్వర్లు మాట్లాడినారు. రేపు జరిగే బందులో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరినారు. దీనితో పాటు బుదు,గురు వారాల్లో, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పోలీసులతో రైతులపై జరిపిన లాఠీ ఛార్జిని, భాష్పావాయువును వదిలి రైతులను గాయపరచడన్ని, రైతులను నిర్భందించడాన్ని తీవ్రంగా కండించారు. రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వనికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కంజర భూమయ్య, రైతు సంఘం నాయకులు , గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కె నారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల సాయిబాబు, రాజారెడ్డి, మన్సుద్ ఖాన్ అశోక్, గణపతి పాల్గొన్నారు.
Spread the love