ఈ నెల 30,31న జరిగే జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి..

– జిల్లా మహాసభల కరపత్రం విడుదల 
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక చౌటుప్పల్ డివిజన్ మహాసభ స్థానిక మార్కెట్ యార్డులో భూపాల్  రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురుపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ 2011 జనభా లెక్కల ప్రకారం దేశంలో 2.21శాతం మంది వికలాంగులు ఉన్నారని,ఘనంకలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక ఘనంకాల విభాగం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 19 శాతం మంది చూపు,వినికిడి లోపం కలిగి ఉన్నారని,8 శాతం మంది బహుళ వైకాల్యం కలిగి ఉన్నారని అన్నారు.76 శాతం మంది గ్రామీణ ప్రాంతంలో 24 శాతం మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వయేతర సౌకర్యాలు వికలాంగులకు అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది వికలాంగులు ఉంటే పెన్షన్స్ కేవలం 5.75లక్షల మందికే వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రకటించి,ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గిస్తూ స్టేట్ సభర్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ,ప్రయివేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవలని అన్నారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వారి వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చేల్లించుకుంటారని అన్నారు.సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి 4 ఏండ్లు అవుతున్న ఎలాంటి పురోగతిలేదన్నారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిలో కో -ఆర్డినేషన్ కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. మానసిక, అటీజం,హేమోఫిలియా,సికిల్ సెల్,కండరాల క్షినత వంటి వైఖల్యాలు కలిగిన వికలాంగుల సంక్షేమo కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.కవి, రచయిత,బాధిరుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ 144వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాపితంగా జరుపుతున్నామని అన్నరు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లేపల్లి  స్వామి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత చౌటుప్పల్  డివిజన్ కార్యదర్శి ఏర్పుల శివయ్య డివిజన్ నాయకులు సంజీవ శంకర్ బర్ల పార్వతి జోకు స్వామి పిట్ట శ్యాంసుందర్ రాయగిరి యాదగిరి మాసపల్లి కృష్ణ ముదిగొండ రాములు బల్గూరి అంజయ్య పిట్ట శ్రీనివాస్ రెడ్డి మంగమ్మ రమాదేవి తిరుపతి రెడ్డి,రవి మాసంపల్లి కృష్ణ కే శ్రీనివాసాచారి వడ్డేపల్లి యాదగిరి తదితరులు పాల్గొనడం జరిగింది.
Spread the love