కేసీఆర్ తో మీటింగ్..అవన్నీ సీక్రెట్ : మల్లారెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈనేపథ్యంలో బుధవారం మరి కొంత మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,కాలేరు వెంకటేశ్, బాండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ,ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన మల్లారెడ్డి మాట్లాడారు. ఈ మీటింగ్ లో చాలా అంశాలపై మాట్లాడుకున్నాము. అవన్నీ సీక్రేట్ అని అవన్నీ తర్వాత చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ మారే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించిన కేసీఆర్.. ఎవరూ తొందరపడవద్దని త్వరలోనే పరిస్థితులు మళ్లీ మనకు అనుకూలంగా మారుతాయని చెప్పినట్లు తెలుస్తోంది . ఈ క్రమంలో మల్లారెడ్డి ప్రస్తావించిన సీక్రెట్ ఏంటి అనేది రాష్ట్ర రాజకీయ వర్గంలో ఉత్కంఠగా మారింది.

Spread the love