Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే ఫైర్

బీజేపీ ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే ఫైర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని రైతాంగం, ఎంఎస్‌ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు ఇంధన దోపిడీతో నలిగిపోతున్నారని, సామాన్యుల పొదుపును మోడీ ప్రభుత్వం తగలబెడుతోందని ఆరోపించారు. రెండు వారాల్లోనే నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 ఏండ్లలో మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి రూ.42 లక్షల కోట్లు లూటీ చేసిందని, ఇది రోజుకు రూ. వెయ్యి కోట్ల దోపిడీతో సమానమని ఖర్గే ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -