పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కల్పిస్తూ దాడికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్..

– నిందుతుని పై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు.. హత్య కేసు లో రౌడీ షీట్
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్ తండాకు చెందిన భూక్యగురుబాబు అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కల్పిస్తూ దాడికి పాల్పడడంతో పాటు అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు ఉండగా ఓ హత్య కేసు ఉండడంతో గురు బాబు పై రౌడీ షీట్ ఉందని దాడికి పాల్పడిన కేసులో అతన్ని జైలుకు పంపించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ముస్తాబద్ మండలం నామపూర్ తండాకి చెందిన భూక్యగురుబాబు అలియాస్ బాబు అనే వ్యక్తి  ఈనెల 25న రాత్రి ఇసుక దొంగ రవాణా చేసి దుబ్బాకలో అమ్ముకుందామని  డ్రైవర్ ప్రశాంత్ ని 26న రాత్రి 2.30 గంటల ప్రాంతంలో రామలక్ష్మణ పల్లి గ్రామ శివారులో గల మానేరు వాగుకి పంపగ అక్కడి నుండి ఇసుక నింపుకొని దుబ్బాక వైపు వెళ్ళుటకు బయలుదేరుతుండగా నామాపూర్ చెరువు కట్ట మీద పోలీసులు అ ట్రాక్టర్ ను పట్టుకున్నారు. డ్రైవర్  ప్రశాంత్ వెంటనే ట్రాక్టర్ యజమాని భూక్యగురుబాబుకు ఫోన్ చేయగా ఆయన అక్కడికి చేరుకొని మళ్ళీ నా ట్రాక్టర్ పట్టుకొని సీజ్ చేస్తారా… గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో 23 కేసులలో వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, మర్డర్ కెసులో కూడా నా పై రౌడీషీట్ ఉన్నదని అతను బెదిరింపులకు గురిచేశాడు. ఈసారి ఎలాగైనా పోలీస్ ల నుండి తప్పించుకోవాలని డ్రైవర్ను దింపి గురుబాబు ట్రాక్టర్ ఎక్కి నా ట్రాక్టర్ పట్టుకొవద్దని, అడ్డు రావద్దని హెచ్చరిస్తూ విధులలో ఉన్న కానిస్టేబుల్  సత్యనారాయణ ను గాయపరిచి తన డ్రైవర్ ను కారులో ఎక్కించుకొని పారిపోగా కేసు నమోదు చేసి ఆదివారం నామపూర్ గ్రామ శివారులో ముస్తాబద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారని ఎస్పీ తెలిపారు. అతనిపై ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో 14 కేసులు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఒకటి గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో ఒకటి సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ లో మూడు కేసులతో పాటు ఒక హత్య కేసులో రౌడీషీట్ ఓపెన్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు.

Spread the love