రిజిస్ట్రేషన్ చేయకుండా మోసానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

– ఇప్పటికే 20 కేసులు అతనిపై ఉన్నట్లు వెల్లడి
– సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – సిరిసిల్ల
భూమి విషయంలో చీటింగ్ చేస్తూ, తప్పుడు కాగితాలు తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేసి, భూమి హద్దులు చూపకుండా రిజిస్ట్రేషన్ చేసి చంపుతానని బెదిరించిన సిరిసిల్ల కు చెందిన  రాగుల రాములు పై  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి  తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం సంజీవయ్య నగర్ కి చెందిన రాగుల రాములు అనే వ్యక్తి  గత 10 సం:ల క్రితం పద్మనగర్ లోని సర్వే నంబరు 960/బి లో  363 చదరపు గజాల భూమి ఉందని దాని జిరాక్స్ కాగితాలు ఎల్లారెడ్డిపేట్ కి చెందిన  ఉప్పుల నారాయణ కు చూపించగా నారాయణ అ భూమి నిజంగానే ఉందని నమ్మి అ భూమికి రూ.3.00,000/-రూపాయలు  ఇచ్చి కొనుక్కొని సిరిసిల్ల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ చేపించుకొన్న తర్వాత హద్దులు చూపించమంటే హద్దులు చూపకుండా  తప్పించుకుంటు తిరుగుతుండగా,నారాయణ  డాక్యుమెంట్ నంబరు 2875/2013 ప్రకారం నారాయణ తహసిల్దార్ కార్యాలయములో చెక్ చేసుకోగా అ భూమి ప్రభుత్వానికి చెందినదని ఉండగా  రాగుల రాములు చేతిలో మోసపోయిన అని గ్రహించిన నారాయణ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా రాగుల రాములు పై కేసు నమోదు చేశారు ఆయన మోసం చేసినట్లు తెలవడంతో రిమాండ్ కు తరలించామని డిఎస్పీ పేర్కొన్నారు. రాగుల రాములు పై భూ కబ్జాలకు ,చీటింగ్ లకు సంబంధించి గతములో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో  20 కేసులు ఉన్నాయని రాగులు రాములు చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Spread the love