తల్లి పాలు, రక్త హీనత వారోత్సవాలు నిర్వహణ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని నెరల్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బామన్ సింగ్ తాండా అంగన్వాడీ సెంటర్ నందు తల్లి పాలు, రక్తహీనత వారోత్సవాల సందర్భంగా తల్లులకు బాలికలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ వినోదిని మాట్లాడుతూ బాలింతలు బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోదిని, అంగన్వాడీ టీచర్ లత,ప్రైమరీ స్కూల్ టీచర్ ప్రతిభ రాణి, వాసవి మరియు బాలింత మహిళలు పాల్గొన్నారు.
Spread the love