నవతెలంగాణ – తాడ్వాయి
పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగితే చర్యలు తీసుకుంటామని జీసీసీ మేనేజర్ జాటోత్ దేవ్ అన్నారు. బుధవారం మండలంలోని కామారం, గంగారం జిసిసి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జీసీసీ మేనేజర్ దేవ్ మాట్లాడుతూ ప్రైవేట్ పెట్రోల్ బంకులు కంటే జీసీసీ ద్వారా నడిచే పెట్రోల్ బంకుల్లో నాణ్యమైన పెట్రోలు దొరుకుతుందన్నారు. త్వరలోనే క్యూఆర్ కోడ్ ఇస్తున్నట్లు, బంకులో ఉన్న గాలి మోటార్ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ వినియోగదారులకు మంచి సర్వీస్ ఇయ్యాలని బంకులో పనిచేసే ఎంప్లాయిలకు సూచనలు ఇచ్చారు.