Magazines

ముఖం పొడిబారుతోందా?

5 రోజుల క్రితం

face
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

శీతాకాలంలో ముఖం పొడిబారడం పెద్ద సమస్యే కాని దానికి సరైన జాగ్రత్తలు అవసరమంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించి సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. అవేంటో చూద్దాం..

తేనెను ఉపయోగించండి: తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని తేమగా ఉంచటంలో సహాయపడుతుంది. పొడిబారడాన్ని తొలగిస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. తరువాత ముఖానికి స్వచ్ఛమైన తేనెను పలుచని పొరగా అప్లై చేసుకోవాలి. తర్వాత 15-20 నిమిషాలకు నార్మల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.

క్రీమ్, మిల్క్ ఫేస్ ప్యాక్: పాలు, క్రీమ్‌లోని కొవ్వు, ప్రోటీన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఒక టీస్పూన్ తాజా క్రీమ్‌ను కొద్దిగా పచ్చి పాలతో కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. దీన్ని వారానికి 3-4 సార్లు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా,మెరుస్తూ ఉంటుంది.

కొబ్బరి నూనెతో మసాజ్ : కొబ్బరి నూనె శీతాకాలపు చర్మానికి ఒక వరం. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖానికి కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. రాత్రిపూట అలాగే ఉంచి ఉదయాన్నే కడుక్కోండి. కొన్ని రోజుల్లో చర్మంలో తేమ, మృదుత్వంలో తేడాను మీరు గమనించవచ్చు.

అల్లోవిర(కలబంద)జెల్ : కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది. పొడిబారడం, అలాగే చికాకు, దురదను తగ్గిస్తుంది. తాజా కలబంద ఆకు నుండి జెల్‌ను తీసి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. కావాలనుకుంటే, దీనిని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.

శనగపిండి,పెరుగు ఫేస్ ప్యాక్: శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.పెరుగు తేమను అందిస్తుంది. టీస్పూన్ పెరుగుతో 2 టీస్పూన్ల శనగపిండిని కలపండి. అవసరమైతే కొద్దిగా రోజ్ వాటర్‌ను కూడా కలపవచ్చు. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి ఆరిపోయే ముందు మెల్లగా కడగాలి. ఈ ప్యాక్ పొడిబారడాన్ని తగ్గించడానికి, మృత చర్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్